చిన్నప్పుడు చదువుకునేటప్పుడు తెలుగు మాస్టారు ఒక మాట చెప్పేవారు ,ఆడపిల్ల అంటే "ఆడ"(అక్కడ అంటే అత్తగారి ఇంటి దగ్గర అని )పిల్లే అని.సరే ఇక్కడ నా ఆలోచనలు కొంచం పంచుకోవాలని .
ఆడపిల్లలకి చదువు ,సంపాదన లేని కాలం లో అన్నిటికీ మగవాళ్ళ పైనే కాలం లో (తండ్రి,భర్త ,కొడుకు ,అన్న)ఈ వాదనకు అవకాశమే లేకపోవచ్చు.కానీ ఆడపిల్లలు చదువుకొని జాబ్ చేస్తూ సంపాదిస్తున్నపుడు ఆ సంపాదనని తనకి కావలసినట్లు ఖర్చు పెట్టకూడదా.పెళ్లి అయ్యినతరువాత ఆ సంపాదన అంతా అత్తగారింటికే చెందాలా .పైసా కూడా పుట్టింటి వారికోసం ఖర్చు పెట్టకూడదా.మగపిల్లాడు చదువుకుని సంపాదిస్థూ తన కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు కదా .చూడాలికూడా.అలాగే ఆడపిల్ల సంపాదిస్తున్నపుడు అదేవిధమైన బాధ్యతలు నెరవేర్చుకునె అవకాశం లేదా .పుట్టింటిలో సంపాదించేవారు ఎవరొకరు ఉంటే ఈ ఆలోచనే ఉండదనుకోండి, కానీ దురదృష్టం కొద్ది ఎవరూ లేరనుకోండి ,అప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్లి పోతే ఆ కుటుంబానికి ఆధారమేది .దీనికంతటికి మనుషుల్లో పెరిగిపోతున్న డబ్బు ఫై ఆశ మాత్రమేనా.
ఒక్కటి మాత్రం నిజం ,ee పరిస్థితి మాత్రం ఎప్పటికి మారదు.
ఒక్కటి మాత్రం నిజం ,ee పరిస్థితి మాత్రం ఎప్పటికి మారదు.
